అసెంబ్లీ లో కేటీఆర్ తో జానారెడ్డి చిట్ చాట్..!

Jana Reddy chit chat with KTR in the Assembly..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి కె జానారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికి ఒకరూ ఎదురుపడ్డారు.
అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన మాజీ మంత్రులు కేటీఆర్, జానారెడ్డిలు కొద్ది సేపు చిట్‌చాట్ నిర్వహించారు. రేపటికి అసెంబ్లీ వాయిదా తర్వాత బయటకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డ జానారెడ్డితో మాటామంతీ జరిపారు.
కేటీఆర్ జానారెడ్డిని హలో అంకుల్ అని జానారెడ్డిని పలకరించారు. మీరు కొన్ని రోజులుగా మీ ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తున్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని కూడా సూచించండి అని అన్నారు. అనంతరం మాజీ మంత్రి జానారెడ్డి సరదగా కేటీఆర్ తో ఓ ఫోటో దిగి వెళ్లారు.
