వైసీపీ ఎంపీ ఇంట విషాదం..!

Tragedy at YSRCP MP’s house..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం కలిగింది.
ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ శ్రేణులు.. నేతలు.. ఆయన అభిమానులు వైవీకి సానుభూతి తెలుపుతున్నారు.
