మనం నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం..!

We stood up.. we made TDP stand up..!
ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ అవమానించారు.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదకోండో వార్శికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారు.. ప్రతిపక్షాలను వేధించారు.
నన్ను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదు.భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు కాబట్టే 2019లో పోటీచేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాము.
మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసైనికులు ప్రశ్ని్స్తే వారిపై కేసులు పెట్టారు. టీడీపీ నేతలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రా అయ్యింది అని తెలిపారు.