మద్యపాన ప్రియులకు షాకింగ్ న్యూస్..!

మద్యపానం మంచిది కాదనే అభిప్రా యం సర్వత్రా ఉంది. అయినా మద్యం సేవించే వారికి కొరతలేదు. అయితే మద్యపానం కొనసాగించే వారి తో పోలిస్తే.. మద్యం మానేసినవారిలో చెడు కొలె స్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ కాస్త ఎక్కువగానూ, మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ఎఎల్ తక్కువగానూ ఉంటుం దని ఒక అధ్యయనంలో తేలింది. జపాల్లో పది సంవత్సరాలపాటు చాలా మందిని అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే నిపుణులు అధ్య యనం కోసం అనుసరించిన పద్ధతిపై ఆచీ తూచీ స్పందించడం విశేషం.
టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన జపాన్ శాస్త్రవేత్తలు, అమెరికా లోని హా ర్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు ప్రి వెంటివ్ మెడిసిన్ కు సంబంధించిన సెంటర్లో ఏటా 3.2 లక్షల మందికి పరిక్షిస్తుంటూ ఉంటా రు. 2012 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకూ ప్రత్యేకంగా మద్యం అలవాటు ఉన్నవారిలో 57,700 మందిపై అధ్యయనం చేశారు. ద జర్నల్ అఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్ వర్క్ ఓపెన్‌లో ఈ అధ్య యనం వివరాలను ప్రచురించారు.
ప్రజలు మద్యపానం ప్రా రంభించిన ప్పుడు వారిపై వ్యతిరేక ప్రభావాలనే చూపుతుందని పేర్కొన్నారు. అల్కాహాల్ అలవాట్లను మార్చుకున్న తర్వాత కొలెస్ట్రాల్ నిర్వహించడానికి లిపిడ్ ప్రొఫైల్‌ను పర్యవేక్షించాలని పరిశోధకులు సూచించినా, అల్కాహాల్ ఈ ప్రభావాలకు కారణం అవుతుందని అధ్యయనం స్పష్టంగా లేదా నేరుగా నిరూపించలేదు.
ఆల్కాహాల్ తీసుకోవడం ప్రారంభించడం వ ల్ల కొలెస్ట్రా ల్ లో స్వల్ప మెరుగుదల ఉంటుంది, అయితే మద్యం సేవించడం మానే యడం వల్ల తక్కువ అనుకూలమైన మార్పులు వస్తాయని నిపుణులు పేర్కొ నడం విశేషం. వైన్ తాగడం వల్ల హృదయ సంబంధమైన ప్రయోజనాలు కలుగుతాయన్న పరిశోధనలకు కాలం చెల్లిందని ఆస్ట్రేలియా ఎడిత్ కోవాన్ యూనివర్సిటీకి చెందిన స్టీఫెన్ బ్రైట్ తెలిపారు. వారానికి ఒకటి, లేదా రోజుకు రెండు పెగ్ లు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు
