అసెంబ్లీలో కేసీఆర్ తో ఓ మంత్రి భేటీ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నాం అసెంబ్లీ స్పీకర్ ప్రాంగాణంలో స్పీకర్ అధ్యక్షత బీఏసీ సమావేశం కానున్నది.
సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై ఆల్ పార్టీస్ మీటింగ్ జరగనున్నది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ నేత.. ఓ మంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్సినట్లు వార్తలు వస్తున్నాయి.
అసెంబ్లీ ప్రాంగాణంలో కేసీఆర్ తో సదరు మంత్రి పదినిమిషాలు భేటీ అయినట్లు తెలుస్తుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇప్పటికే ప్రభుత్వంలో అసంతృప్తులు చెలరేగుతున్న తరుణంలో ఓ మంత్రి ప్రతిపక్ష నేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం రాజకీయంలో ఏమైన అలజడి జరగనున్నదా అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
