రేవంత్ రెడ్డి కాదు రేవతి రెడ్డి..!

Not Revanth Reddy, but Revathi Reddy..!
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత పది హేను నెలలుగా మహిళలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రేవతి రెడ్డిగా మార్చుకోవాలని బీజేపీ మహిళా నేత మేకల శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో శిల్పా రెడ్డి మాట్లాడుతూ ” మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామని చెప్పారు. పెండ్లికి కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.
పదో తరగతి పాసైన విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి పది హేను నెలలైన ఇంతవరకూ ఒక్క హామీని నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పేరును రేవతి రెడ్డిగా మార్చుకోవాలని ఆమె సూచించారు.
