భారత్ లక్ష్యం ఎంతంటే..?

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 స్కోర్ చేసింది.
కివీస్ ఆటగాళ్లల్లో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ జట్టు స్కోర్ చేసేందుకు కష్టాలు పడింది.
భారత్ బౌలర్లల్లో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. చివర్లో బ్రేస్వెల్(53) అర్ధ సెంచరీతో రాణించారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు 252 పరుగులు చేయాల్సి ఉంది.
