ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్..!

VRS for BRS in MLC elections..! mp from medak
తెలంగాణలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ టౌన్ లో భారతీయ జన ఔషధీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నా యకురాలు కవిత బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఇద్దరు గెలిస్తే ఒకరు బీసీ, మరొకరు ఓసీ వ్యక్తి అని చెప్పారు. దేశంలో బీసీలకు నిజమైన న్యాయం బీజేపీతోనే జరుగుతుందని పేర్కొన్నారు. బీసీలకు ఎవరైనా అన్యాయం చేశారంటే అది బీఆర్ఎస్సే అని ఆరోపించారు. బీఆ ర్ఎస్ పాలనలో కవిత కుటుంబ సభ్యులే పద వులన్నీ అనుభవించారని విమర్శించారు.
కేసీఆర్ తొలిసారి పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రిమండలిలో చోటు ఇవ్వకుండా దేశంలోనే రికార్డు సృష్టించారని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా బీసీలకు చేసిన అన్యాయాన్ని సరి దిద్దుకోవటానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, మండలిలో బీఆ ర్ఎస్ పక్ష నేతగా బీసీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
