తూచ్.. నేను అలా మాట్లాడలేదు

పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి)
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను. కాంగ్రెస్ పార్టీ మీడియాలో రాయని పదాన్ని వాడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందిస్తూ తనను ఫ్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిసింది వాస్తవం.. వాళ్లు వాళ్ల సమస్యలను చెప్పుకున్నారు. నేను వాళ్లకు భరోసానిచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీచ్చాను అని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ ప్యారానగర్ డంప్ యార్డు విషయంలో కాంగ్రెస్ పై నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. నేను మాట్లాడినట్లు ఫ్యాబిక్రేటెడ్ వీడియోలతో అసత్య ప్రచారం చేశారు…తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.