రేవంత్ రెడ్డికి బిగ్ షాక్- ఆందోళనలో హాస్తం నేతలు!

గత ఏడాదిగా అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఎక్కడోకచోట నిత్యం ప్రజల నుండి ప్రభుత్వంపై విమర్శలు.. నిరసనల జ్వాలలు కన్పిస్తూనే ఉన్నాయి.
రైతులకు సాగునీళ్ళు అందటం లేదనో.. తాగునీళ్లు అందటం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావడమో.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ యువత.. హాస్టళ్లల్లో.. గురుకులాల్లో మెస్ బాగోడంలేదనో.. పనితీరు బాగోడటంలేదనో ఇలా కారణం ఏదైన సరే కానీ నిత్యం అన్ని వర్గాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కన్పించేలా నిరసనలు.. ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఉపాధ్య విద్యావంతుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు ఒక్కసీటు దక్కకపోవడం ఆ పార్టీపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నరో ఆర్ధమవుతుంది. మరోవైపు అధికారంలో ఉండి కూడా తమ సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోలేకపోవటం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావించాలి.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కాళ్లకు బలపం కట్టుకుని మరి తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. తాము అమలు చేసిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది.
సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును కోల్పోవడం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోలేకపోవటం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.