మరో రూ.2000 కోట్ల అప్పుకి రేవంత్ సర్కారు సిద్ధం..!

anumula revanth reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈవేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ మొత్తాన్ని తీసుకుంది.
ఇందులో 22 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 24 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం చేసిన అప్పు రూ.63,586 కోట్లకు చేరింది.
ఇవి కాకుండా ఈ నెల 11వ తేదీన రూ.2,500 కోట్లు, 18వ తేదీన రూ.2000 కోట్లు, 25వ తేదీన రూ.2,500 కోట్ల రుణాలు తీసుకుం టామని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన ఇండెంట్లలో భాగంగా ఆర్బీఐకి తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది. అయితే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎఫ్టిర్బిఎం) పరిధిలోకి వచ్చే వీటికి కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అన్నది చూడాలి. .