రష్మికా మందన్నాపై కాంగ్రెస్ నేతలు గుర్రు..!

కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హజరు కాలేదు.. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు కర్ణాటక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలు ..
దేశంలో వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారు.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు..
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు..
