తీన్మార్ మల్లన్న సస్పెండ్ – మున్నూరు కాపు నేతల భేటీ..!

Teenmar Mallanna
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మున్నూరు కాపు నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి. మాజీ ఎంపీ అయిన వీ హన్మంతరావు నివాసంలో మున్నూరు కాపు వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గోన్నారు.
ఈ భేటీ సందర్భంగా త్వరలోనే బల ప్రదర్శనకు సిద్ధమవ్వాలని మున్నూరు కాపు నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో అన్యాయం జరిగిందని పలువురు మున్నూరు కాపు నేతలు తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు నేతల డిమాండ్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కృతజ్ఞత సభ పెట్టాలని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.
అయితే మున్నూరు కాపు వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తేనే కృతజ్ఞత సభ పెడతామని నేతలు తేల్చి చెప్పారు.కాంగ్రెస్‌లో కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.మున్నూరు కాపుల ఐక్యత కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలి.ఈ కమిటీల్లో అన్ని పార్టీలకు చెందిన నేతలకు బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించారని టాక్.
