మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

Revanth Reddy Telangana CM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్తను తెలిపింది. ఈ నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఎనిమిది పథకాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగా తెలంగాణలో మహిళాదినోత్సవం రోజు పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నది ప్రభుత్వం. మొత్తం ఈనెల 8న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నరు. రాష్ట్రంలో ఉన్న పలు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను అందజేయనున్నారు.
ఈ క్రమంలో మొదటి విడతలో 50 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలును అందజేయనున్నారు..మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నది.
సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఇందిరా మహిళా శక్తి-2025 విడుదల చేయనున్నరు .మొత్తం 14వేల అంగన్వాడీటీచర్లు,హెల్పర్ల నియామక నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నది ప్రభుత్వం.
