చిత్తూరులో సీఎం చంద్రబాబు..!
Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh
![]()
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని జీడీ నెల్లూరులో లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు.
అనంతరం 10 సూత్రాల అంశంపై ఆయా ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నరు.
రామానాయుడు పల్లెలో సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశంలో పాల్గోని పార్టీ కార్యక్రమాలపై.. కార్యకర్తలు.. నేతల గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించనున్నారు..