సీఎం రేవంత్ రెడ్డినే లెక్కచేయని మంత్రులు.. ఎమ్మెల్యే..ఎంపీలు..!

Ministers.. MLA.. MPs.. who do not count CM Revanth Reddy..!
ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు .. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటితో చెప్పిన మాటలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా తొలిసారి ఈ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ తో జరిగిన తొలి ఏఐసీసీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికిన పలుకులు ఇవి.
ఆయన మాట్లాడుతూ పార్టీలో పదవులు ఊరికేనే రావు. కూర్చున్న చోట ఉంటే ఎవరికి దక్కవు. రాహుల్ గాంధీ సైతం పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్లారు. మనం కూడా వెళ్లాలి. మనకు అనేక సమస్యలుంటాయి. కొంతమందికి పదవులు రాలేదనే బాధ ఉంటది. నేను చెప్పిన పని సైతం కావడం లేదనే అసంతృప్తి ఉంటది. ఎక్కడకో ఎందుకు ముఖ్యమంత్రి అయిన నాకు సైతం అసంతృప్తి ఉంది.
నేను చెప్పిన కానీ నా మాట ఎవరూ వినడం లేదు. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే నేను ఢిల్లీకెళ్తే ఆయన హైదరాబాద్ వస్తాడు. నేను హైదరాబాద్ వస్తే ఆయన ఢిల్లీకెళ్తాడు. నేను పిలిస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రేపు సాయంత్రం వస్తారు. అసలు నామాటను లెక్క చేయడం లేదు అని వాపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
