పంట ఎండింది.. పరిహారం ఇవ్వండి- కాంగ్రెస్ నేత!

Former Congress MLA to enter films..!
ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ నేత.. ఒక్క నేతనే కాదు ఆ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు. అయితేనేమి పార్టీ నేత కంటే ముందు ఓ రైతు. అందుకే తనకున్న రెండున్నర ఎకరాల సాగుభూమిలో పంట వేశాడు. దానికి నీళ్లకోసం బోర్లు వేశారు.
రెండు నెలలైన కానీ చుక్క నీళ్లు రాలేదు.. పదిహేను రోజులు ఎదురుచూసిన కానీ ఆ బోరు నుండి నీళ్లు రాలేదు. దీంతో తన పంట ఎండింది. పంట నష్టం తో తనకు అరవై వేల ఆర్థిక సాయంగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అసలు విషయానికి వస్తే జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గానుగుహాపాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రెడ్డబోయిన నర్సయ్య తన పంట ఎండిపోవడంతో నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
