బాలయ్య …తీరు మారదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సినీనటుడు, హిందుపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న గురువారం తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు.
ఈ సందర్భంగా తన తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామస్థులు ఆయనను కలిశారు. తమ గ్రామాన్ని ఓసారి సందర్శించాల్సిందిగా ఎమ్మెల్యే బాలకృష్ణను వారు కోరారు.
దీనికి ఆయన స్పందిస్తూ ‘కొమరవోలా.. అదెక్కడా. అయినా ఆ ఊరికి జన్మలో రాం. ఆ ఊర్లో ఉండే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకేం పనులు లేవా?’ అంటూ వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
