మెగాస్టార్ మరో డ్యూయెల్ రోల్..!

chiranjeevi
సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ‘నకిలీ మనిషి’ నుంచి ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ వరకూ ఓ పదకొండు సిని మాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడిం దంతా దేనికంటే.. మళ్లీ ఆయన రెండు పాత్రలతో తెరపై మెరవనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేయనున్నారట. ఈ రెండు పాత్రలూ దేనికదే విభిన్నంగా ఉంటాయట.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. అనిల్ టీమ్ స్క్రిప్ట్్న పూర్తి చేసే పనిలో ఉన్నారు. చిరంజీవి ఇమే జ్కి తగ్గట్టుగా అనిల్ మార్క్ కామెడీతో ఈ స్క్రిప్ సిద్ధం అవుతున్నదట. ఈ కథకు చిరంజీవి కూడా బాగా కనెక్ట్ అయ్యారని తెలుస్తున్నది. చాలాకాలం తర్వాత చిరంజీవి చేస్తున్న గొప్ప కామెడీ సినిమా ఇదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్ కు దర్శకుడు అనిల్ కామెడీ తోడైతే థియేటర్లలో నవ్వుల వరదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
