అక్షర్ పటేల్ సూపర్ రనౌట్- వీడియో..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న పాకిస్ఠాన్ జట్టుతో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అక్షర పటేల్ చేసిన సూపర్ రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. భారత ప్లేయర్ అక్షర్ పటేల్ చురుకుగా వ్యవహరించి అద్భుతమైన రనౌట్ చేశారు.
పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని పాక్ బ్యాటర్ ఇమామ్ మిడ్ ఆన్ లోకి ఆడి.. రన్ కోసం పరిగెత్తారు. తన వైపు వచ్చిన బంతిని అందుకున్న అక్షర్ వెంటనే డైరెక్ట్ త్రో చేసి ఇమామ్ ను రనౌట్ చేశారు. దీంతో పాక్ వరుస ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు ఓవర్లో బాబర్ వికెట్ ను హార్దిక్ పడగొట్టారు.పదివికెట్లను కోల్పోయి పాకిస్థాన్ 242పరుగులు చేసింది .లక్ష్య ఛేదనలో భారత్ రెండు వికెట్లను కోల్పోయి 31.3ఓవర్లలో 174పరుగులు చేసింది.కోహ్లీ 65(77)*,శ్రేయస్ 40(47)*పరుగులతో క్రీజులో ఉన్నారు..
