రోహిత్ శర్మ రికార్డు..!

Rohit Sharma Indian cricketer
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న గురువారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి పోరులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలోకి అరుదైన రికార్డు చేరింది.
70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు.
అన్ని ఫార్మాట్లు కలిపి 137 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూశారు. వాటిలో 3 గేమ్స్ డ్రా అయ్యాయి. ఒకటి రద్దయింది. ఇక 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించిన ప్లేయర్ రోహిత్ మాత్రమే అవ్వడం విశేషం.
