తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

tummala nageshwararao
తెలంగాణలో చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలోని 190 చేనేత సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తనను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులకు వివరించారు.
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం, పొదుపు పథకంలో నిధుల జమపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు