మాజీ మంత్రి హారీష్ రావు పేరు చెప్పకపోతే చంపేస్తాం..!

 మాజీ మంత్రి హారీష్ రావు పేరు చెప్పకపోతే చంపేస్తాం..!

Loading

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పేరు చెప్పకపోతే థర్డ్ డిగ్రీ చూపిస్తాము. అవసరమైతే రాత్రికి రాత్రే చంపేస్తాము అని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన తనను బెదిరించినట్లు డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ లపై వంశీ కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. తనను అనేక చిత్రహింసలకు గురి చేశారు.

ఈ కేసులో హారీశ్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేత మచ్చ వేణుగోపాల్ రెడ్డి పేర్లను వాంగ్మూలంలో చెప్పాలని బెదిరించారని పేర్కొంటూ 14వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేశారు. ఈ కేసులో ‘హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 15న విచారణ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యాను. డీసీపీ విజయ్‌కుమార్‌, ఏసీపీ మోహన్‌కుమార్‌ చిత్రహింసలు పెట్టారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మచ్చ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్‌ ఈ రోజు రాత్రిలోపు లేకుండా చేస్తాం అని బెదిరించారు…’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వంశీకృష్ణ స్వదస్తూరితో రాసిన అఫిడవిట్‌ను ఆయన తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్‌ నిన్న గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *