నిన్న సచివాలయం..నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్..రేపు ప్రజాభవన్..?

ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచిబాలయంలో ఐపీఎస్ అధికారినంటూ ఒకరూ.. రెవిన్యూ అధికారినంటూ ఇంకొకరూ.. ఎమ్మార్వోనంటూ మరోకరూ ఇలా నకిలీ అధికారులు నిజమైన అధికారులుగా చెలామణి అవుతూ హాల్ చల్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఆ సంఘటన మరిచిపోకముందే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటూ సీఎం దగ్గర నుండి మంత్రులు నిత్యం వస్తూ పోతుండే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చోటు చేసుకుంది..
అసలు విషయానికి వస్తే ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు.హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు.దుండగుడు తన ముందు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు.
అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.
