బాబుకు పదవీ గండం..?

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు తప్పదా..?. రాబోయే రోజుల్లో తన తనయుడ్ని సీఎం చేయాలి.. దాదాపు ఓ ఇరవై ఏండ్లు టీడీపీనే అధికారంలో ఉండాలి అని కంటున్న కలలు కలలుగానే మిగలనున్నాయా..?. చంద్రబాబు అంటే వెన్నుపోటు రాజకీయాలని పేరు తరుణంలో అదే బాబుకు సమస్యగా మారనున్నదా ..?. వచ్చే ఎన్నికల్లో బాబుకు పదవీ గండం ఉన్నదా అంటే అవుననే అన్పిస్తుంది ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ తాజా వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ ముఖ్య అనుచరుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ఆశాజ్యోతిగా జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలవనున్నారు.
ముఖ్యమంత్రులుగా నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాధించలేని విభజన హామీలను కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ సాధించాలి.. కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించాలి.. అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశాన్ని ప్రస్తావించాలి అని అన్నారు. అరుణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యల వెనక డిప్యూటీ సీఎం గా పవన్ సాధించిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు టీడీపీతో పొత్తు వద్దే వద్దని భీష్మించుకుని కూర్చున్న మోదీషాలను ఒప్పించి మరి కూటమిగా ఏర్పడటంలో పవన్ కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం.
ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఏ నాయకుడ్కి.. ఏ పార్టీకి సాధ్యం కానీ విన్నింగ్ రేటును సాధించాడు పవన్.. సాధించింది జనసేన పార్టీ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఓ ముఖ్యమంత్రి పని చేస్తే ఎలా ఉంటదో చేసి చూయించాడు .. చూపిస్తాడని ఏపీ ప్రజల్లో ఆలోచన ఉంది. పవన్ మాట్లాడాడు కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. రాజధానికి ఆర్థిక సాయం ఇలా పలు అంశాల్లో ఆయన పాత్ర ఉంది.
కానీ బాబే తన సొంత ఇమేజ్ కోసం పవన్ ను మీడియా ఫోకస్ కానీవ్వడం లేదనే విమర్శ ఉంది. తాజా ఆరుణ్ వ్యాఖ్యలతో మొదటిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడి.. రెండో సారిపోటీలో రికార్డు మెజార్టీతో గెలవడమే కాదు చరిత్ర సృష్టించాడు. ముచ్చటగా మూడోసారి పూర్తి స్థాయి లో పార్టీ బరిలోకి దిగి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని జనసైనికులు తెగ సంబరపడిపోతున్నారు. చూడాలి మరి రాజకీయాల్లో ఏదైన సాధ్యమే కదా..?
