మాటవినకపోతే సస్పెండ్ చేస్తా – రేవంత్ వార్నింగ్!

Revanth Reddy is a joker.. a paper tiger..!
అధికారులు ఎవరైన సరే మాటవినకపోతే సస్పెండ్ చేస్తానని ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే వివేక్ కు చెందిన మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు ఏసీ రూం ల నుండి బయటకు రారు.. ప్రజల సమస్యలను పట్టించుకోరంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద తన ఆగ్రహం వెళ్లగక్కారు.
తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి ఏకంగా చెప్పిన మాట వినని ఐఏఎస్‌లను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడని ఆ వార్తల సారాంశం.దీంతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్ ఇప్పుడు బహిరంగ యుద్ధానికే దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నట్లు అన్పిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆల్ ఇండియా సర్వీస్ కేడర్‌కు చెందినవాళ్లు. వారిని ఒక స్థాయి వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం శాసించగలదు. అలాంటిది బ్యూరోక్రాట్లతో డైరెక్ట్ యుద్ధానికి తలపడటం ద్వారా రేవంత్ కొత్త చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు అని పొలిటీకల్ క్రిటిక్స్ భావిస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వెనుకపడ్డ రేవంత్ ప్రభుత్వానికి ఇదొక కొత్త తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి