చంద్రబాబు..లోకేష్ కి అందగాళ్లు నచ్చరా..?

Chandrababu – Lokesh
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని మాజీ సీఎం .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పష్టం చేశారు. జైళ్ళో ఉన్న ఆ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పరామర్శించాడు.
అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా బాబు తట్టుకోలేడు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నాయుడుల కంటే అందంగా ఉన్నారని కూడా ఆక్రోశం వస్తుంది. ఆయన, వాళ్ల కొడుకు మాత్రమే ఆ కులంలో లీడర్లు. వాళ్లకు అనుకూలంగా లేకపోతే వారిని సమాజం నుంచి వెలివేస్తారు’ అని ఆయన ఆరోపించారు.
