మోదీ అనుమతి తీసుకోని రేవంత్ రెడ్డి …!

Modi, Revanth
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎవర్ని అడిగి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.. బీజేపీ మద్ధతు తీసుకోని బీసీ కులగణన చేశారా అని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మోదీ పుట్టుకతోనే బీసీ. రాహుల్ గాంధీది ఏ కులం .. సోనియా గాంధీ ఇటలీ.. వాళ్ల తాత గారు ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎస్సీనా.. ఎస్టీనా.. బీసీనా.. ఓసీనా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అయిన ఎవర్ని అడిగి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంది.
బీసీలలో హిందూ బీసీలు.. ముస్లీం బీసీలుంటారా.. అలా అయితే హిందూ ఓసీలు.. హిందూ ముస్లీంలు లేరా.. ఎక్కడైన జనాభా పెరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీ జనాభా తగ్గుతుంది. బీసీల నుండి ముస్లీంలు.. క్రైస్తవులను వేరు చేస్తేనే బీజేపీ మద్ధతు ఇస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఒప్పుకుంటారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
