జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..!

J. Jayalalithaa Former Chief Minister of Tamil Nadu
6 total views , 1 views today
తమిళనాడు దివంగత సీఎం.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..?. అక్షరాల ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కోట్లకుపైగా ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు.
వీటిలో మొత్తం 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను అందజేశారు.
అయితే వీటిని తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో ఆరు ట్రంకు పెట్టెలను అధికారులు తీసుకోచ్చారు. దివంగత సీఎం జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి అధికారులు భద్రపరిచారు. అయితే ఈ ఆస్తుల విలువ కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది
