బీఆర్ఎస్ ఎంపీ ఎంపీ వద్దిరాజు పిలుపు..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17వతేదీ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాల్సిందిగా పార్టీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరితసేన,ఇగ్నిటింగ్ మైండ్స్ ప్రచురించిన, చేపట్టిన వృక్షార్చన పోస్టర్లను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,మన భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి,అన్ని విధాలా అభివృద్ధి చేసిన మహనీయులు కేసీఆర్ పుట్టినరోజు మనమందరం కూడా మూడు, అంతకుమించి మొక్కలు నాటుదామన్నారు.ఈ బృహత్తరమైన కార్యంలో భాగస్వాములై దిగ్విజయం చేయాల్సిందిగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.
