కర్మ ఎవర్ని వదిలిపెట్టదు.!

vangalapudi-anitha.jpg
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వంశీని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో వీర్ని విజయవాడ సబ్ జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అంశంపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది..
డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.. నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చు.. అయిన ఎన్నిసార్లు ఈ 8 నెలల్లో వైసీపీ నేతలు కలవలేదో చెప్పాలి.. వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే.. అన్ని ఆధారాలు ఉన్నాయి అని అన్నారు.
