మంత్రివర్గ విస్తరణకు ఆ ఇద్దరూ నేతలు బ్రేక్..!

 మంత్రివర్గ విస్తరణకు ఆ ఇద్దరూ నేతలు బ్రేక్..!

Loading

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్న ఇంకా ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొన్ని నెలల పాటు వాయిదా వేయాలని ఆ పార్టీ జాతీయ అధిష్ఠానం నిర్ణయించినట్టు గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న రెండు కుటుంబాలు తమ వాళ్ల కోసం పట్టుబడుతుండటం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకే బలమైన సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పట్టువీడకపోవడంతో విస్తరణపై పీఠముడి పడినట్టు టాక్. మరోవైపు, ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రికి పడని ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుండటం కూడా మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణమని కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చర్చిం చుకుంటున్నాయి.

ఇప్పటివరకూ పన్నెండు బెర్తులు పూర్తయిన నేపథ్యంలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేయడానికి సామాజిక కుల సమీకరణలకు అనుగుణంగా ప్రతిపాదిత జాబితాతో ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంలు పలుమార్లు ఢిల్లీకెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంను కలిశారు. అయితే రాష్ట్ర వ్యవహారాలను చూసుకునే దీపాదాస మున్షీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు చర్చించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకుఒక్కొక్కటి చొప్పున, బీసీలకు ప్రత్యేకించి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒకటి, మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గా నికి, మరొకరికీ ఇవ్వాలని సూచించి నట్టు తెలిసింది. అధిష్ఠానం సూచనద్రతారం రెడ్డి సామాజిక వర్గానికి ఒకేఒక్క మంత్రి పదవి సక్కనుండగా, ఎనిమిది మంది పోటీ పడుకు న్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోన టిరెడ్డి రాజగోరెడ్డి మొదటినుంచీ మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

ఇది జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు.. తాజా మంత్రి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి సైతం మంత్రి వడచి ఆశిస్తురు. కష్ట కాలంలో పార్టీని నడిపించానని, పార్టీ కోసం పీఎల్ పదవి త్యాగం చేసినందున తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్త మకుమార్ రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామా జిక వర్గం నేతలు మంత్రివర్గంలో ఉండటం. మళ్లీ ఆది కుటుంబానికి ఇస్తే.. పార్టీ కుప్పకూలి పోతుందని పీసీసీ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు గిరిజన నేత పేరును సూచిస్తూ ఎస్టీ లంబాడ సామాజికవర్గానికి చెందిన నేతకు ముత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందని సూచించినట్టు తెలిసింది.ఊహించిన సులువుగా కుల సమీకరణల కూర్పు సాద్యం కాదని, ఉరుము మూతికి తేనె పూసి కోట గోడలను ఎక్కించి నట్టు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే వార్తలతో ఎంతకాలమైనా నెట్టుక రావొచ్చు కానీ, ఒకసారి పదవులు భర్తీ చేస్తే తలనొప్పులు వస్తాయి. ఆది ప్రభుత్వ వానికి కూడా ఇబ్బందులకు దారి తీయవచ్చనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలిపింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *