ఉద్యమాల గడ్డ ఉస్మానీయాలో ఉద్యమ కారులతో ఉద్యమ నేత ఎర్రోళ్ల..!

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు.. తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ ఎస్టీ కమీషన్ & మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ .. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈరోజు మంగళవారం ఉద్యమాల గడ్డ ఉస్మానీయాలో ఉద్యమ కారులతో కాసేపు గడిపారు.

ఈసందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ నాయకులు. ఉస్మానీయ విద్యార్థి నాయకులతో గడిపారు. ఈక్రమంలో ఉద్యమ పాఠాలు, జీవిత పాఠాలు, రాజకీయ పాఠాలు.. కలగలిపి నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీలో స్నేహితులు, హితులు, విద్యార్థి నాయకులతో చాయ్ తాగుతూ గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు..

తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు ఇంకా కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ గారి పిలుపుతో లాఠీలకు, తూటాలకు, ఇనుప కంచెలకు వెరవకుండా కదం తొక్కిన నాటి గుర్తులు గుండెలో పదిలంగా ఉన్నాయి.అదొక అపూర ఘట్టం. చరిత్రలో నిలిచిపోయే అరుదైన సందర్భం. స్వరాష్ట్ర సాధనలో నేను సైతం భాగస్వామ్యం కావడం జన్మజన్మల అదృష్టం అని వారితో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

