ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ అందుకే దూరం..!

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటి చేయడంలేదన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పోటి చేయకపోవడంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ ” కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటం కోసమే చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
మరోవైపు బీజేపీకి మద్ధతుగా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ఆరోపిస్తుంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందటంతో మా పార్టీ నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల నమోదు ప్రక్రియలో పాల్గోనలేదు. అందుకే మేము బరిలోకి దిగలేదు.. ఇందులో దాపరికం లేదు. ఉన్నదే చెబుతున్నాను అని అన్నారు.
