రేవంత్ రెడ్డి గారూ.. ఇది సోషల్ మీడియా యుగం..!

 రేవంత్ రెడ్డి గారూ.. ఇది సోషల్ మీడియా యుగం..!

Loading

దాడి జరిగింది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం కి దగ్గరలో ఉన్న గుండాలలో కాదు. పోనీ ఇటు వైపు వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోనూ కాదు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని మహానగరం.. రాష్ట్ర గుండెకాయ అయిన హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న చిలుకూరి బాలజీ ఆలయంలోని ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై. ఈ దాడి జరిగి కూడా రెండు రోజులవుతుంది. ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.. అటు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన సంఘటన ఇది.

ఇలాంటి సంఘటన గురించి బాధిత పూజారి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూజారి ఇంటికెళ్లి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి సారు ఈ సంఘటన తెల్సి నేను పూజారి రంగరాజన్ ఇంటికి వచ్చాను. మీరు ఒక్కసారి మాట్లాడండి అని ఇచ్చారు. ఫోన్ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ” పూజారి గారు బాగున్నారా.. ఇంత సంఘటన జరిగిన నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించి.. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ఈ విషయంపై ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి బాధితుడితో మాట్లాడి భరోసానివ్వడం మెచ్చుకోదగ్గ అంశం. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి. అందులో హోం శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు ఈ సంఘటన గురించి తెలియకపోవడం చాలా బాధాకరం. మన సీఎం గారు ఏయుగంలో ఉన్నారేమో.. ఇది సోషల్ మీడియా యుగం. స్కూల్ కెళ్లే పోరడి దగ్గర నుండి పండు ముసలి వరకూ స్మార్ట్ ఫోన్ ఉన్న రోజులివి. అలాంటిది రేవంత్ రెడ్డి గారికి ఈ సంఘటన తెలియకపోవడం నిజంగా మంచిగా లేదు. సారు మీరు సోషల్ మీడియా.. మీడియా చూడరా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *