అర్చకుడు రంగరాజన్ పై దాడి వెనక ట్విస్ట్!

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ..ఇంటిపై.. ఆంధ్రప్రదేశ్, అనపర్తి నియోజకవర్గ వాసి అయిన వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన సంఘటన పెనుసంచలనానికి దారి తీసిన సంగతి తెల్సిందే. ఈదాడిలో భాగంగా వీర రాఘవ రెడ్డి ఏకంగా రంగరాజన్ ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు .
దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి వెనక సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. దాడికి ముందు గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీర రాఘవరెడ్డి బృందం రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నాను.ఇందుకు ప్రతి శనివారం చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలని అర్చకుడ్ని కోరారు.
దీనికి సమాధానంగా అలా చేయడం కుదరదని తేల్చి చెప్పారు రంగరాజన్. తాను చెప్పినట్లు వినకపోయేసరికి రంగరాజన్ పై వీర రాఘవ దాడికి దిగారు. అంతేకాకుండా రంగరాజన్ పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డింగ్ చేయడం విశేషం.
