రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్..!

Words that crossed the forts.. but Revanth’s actions that crossed the threshold..?
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చేసిన వ్యాఖ్యలతో ఇటు తెలంగాణ కాంగ్రెస్.. అటు జాతీయ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ” హర్యానాలో మమ్మల్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ గెలికారు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అందుకే మేము ఢిల్లీలో గెలికాము. ఇబ్బంది పెట్టాము. అందుకే బీజేపీ గెలిచింది అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇటు గాంధీ భవన్ లో అటు ఢిల్లీలోని ఇందిరా భవన్ లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పైకి కొట్లాడుకున్నా లోలోపల ఒకటే అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ విమర్శలకు బలం చేకూర్చినట్లు అయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణలో బీజేపీ నేతలు సైతం అధికార కాంగ్రెస్ పార్టీలోపాలను .. హామీల అమలుపై ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ పై విరుచుకుపడటం కూడా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఒకటే అనే వార్తలను నిజం చేస్తున్నాయని వారు వాపోతున్నరు. ఇప్పటికే ఏడాది పాలనలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలో రేవంత్ తాజా వ్యాఖ్యలు తమను .. పార్టీని భూస్థాపితం చేసేలా ఉన్నాయి.
రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అని సీనియర్లు తమ అనుచరుల దగ్గర మొరపెట్టుకుంటున్నారంట. ఈ విషయాన్ని ఢిల్లీకి చేరవేసి ఇప్పటికైన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించాలని ప్రణాళికలు రచిస్తున్నారని గాంధీ భవన్ లో టాక్.