ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు మొత్తం డెబ్బై స్థానాల్లో బీజేపీ నలబై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ ముప్పై స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ “ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చాక ఆప్ పార్టీ నేతలు పలు కుంభకోణాలకు పాల్పడ్డారు.. జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు..
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించాము.. ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు.. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
