కుల గణనలో ప్రభుత్వ కుట్ర

 కుల గణనలో ప్రభుత్వ కుట్ర

Loading

ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె రాజు గారి ఆధ్వర్యంలో ఎన్టిపిసి కూడలిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రె రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనలో SC ల యొక్క కులగణనను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోకపోగా మేము ఊహించినట్టుగానే SC ల జనాభా యొక్క సంఖ్యను తప్పు గా చూపించారని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి భావిస్తుంది..

కులగణనలో ఒక్కరిని కూడా క్రైస్తవులు గా నమోదు చెయ్యకపోవడం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టిన కుట్ర అని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి భావిస్తుంది. ఎందుకంటే ప్రతి SC వాడలో చర్చి ఉంది. ప్రతి ఆదివారం SC కులాల నుండి క్రైస్తవులు గా కన్వర్ట్ అయిన వారు చర్చి కి వెళ్తున్నారు. క్రైస్తవుల జనాభా ను అసలు చూపించకపోవడం వెనుక ప్రభుత్వం SC లకు కల్పించే ప్రతి పథకంలో అలాగే స్థానిక ఎన్నికల్లో SC రిజర్వేషన్ స్థానాలకు క్రైస్తవులకు కట్టబెట్టే కుట్రగా మేము భావిస్తున్నాము. SC జనాభా ను మళ్ళీ లెక్కించాలని, SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుందని చెప్పారు.

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ , ఏబీసీడీ వర్గీకరణవిచారణ కమిటీ ఏక సభ్య కమిషన్ చైర్మన్ SHAMIM అక్తర్ ని కలిసి రాజ్యాంగం లో పొందుపరిచిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ను పరిగణలోకి తీసుకోని వర్గీకరణ లో కన్వర్టెడ్ క్రైస్తవులకు (BC-C) అవకాశం కల్పించొద్దని మేము చేసిన విజ్ఞప్తి ని వారు కూడా పరిగణలోకి తీసుకోలేదు.కావున ఇవన్నీ చేస్తుంటే హిందువులు గా జీవిస్తున్న SC ల యొక్క హక్కులను, అవకాశం కోళ్లగొట్టి కన్వర్ట్ అయిన(బి సి -C) క్రైస్తవులకు కట్టబట్టే కుట్ర గా భావిస్తున్నాము.

మళ్ళీ SC ల జనాభా ను లెక్కించి, కన్వర్ట్ అయిన వారి జనాభా ను దళితుల నుండి వేరు చేసి SC లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతారని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి మిమ్మల్ని వేడుకుంటుంది. లేనిపక్షం లో SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి నిర్వహించే పోరాటాలకు, తద్వారా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల రాష్ట్ర నాయకులు మిట్టపల్లి సతీష్ కుమార్, వినయ్, కాలా , శ్రీకాంత్, రమేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *