పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా లేనట్టే.

Vice President election coming soon..!
తెలంగాణలో నిర్మితమవుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా గురించి లోక్ సభలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పింది.
దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మేము అధికారంలోకి రాగానే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
