కేంద్ర మంత్రి గడ్కారితో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!

 కేంద్ర మంత్రి గడ్కారితో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సహచర ఎంపీలు కే.ఆర్.సురేష్ రెడ్డి, దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్,ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తదితర ప్రముఖులతో కలిసి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లతో భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభలో సహచర సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో గురువారం మధ్యాహ్నం గడ్కరీ, ధర్మేంద్రలతో భేటీ అయ్యారు.

తెలంగాణలో ప్రధానమైన పలు రోడ్లను మరింత విస్తృత పర్చేందుకు, అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.అలాగే, వారు మానవ వనరుల అభివృద్ధి శాఖ (విద్యా శాఖ) మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణకు ఐఐఏంను వెంటనే మంజూరు చేయాలని,పలు త్రిపుల్ ఐటీలు,కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ పాఠశాలలను నెలకొల్పాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేంద్ర మంత్రులు గడ్కరీ, ధర్మేంద్రలకు పుష్పగుచ్చాలిచ్ఛి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారి వెంట పార్టీ ప్రముఖులు బాల్క సుమన్, డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, ఆంజనేయలు గౌడ్,వాసుదేవ రెడ్డి తదితరులు ఉన్నారు.బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు చెప్పిన అంశాలు,కోరిన పనుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *