వాళ్లకు ఉచిత రేషన్ కట్
దేశంలో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా గతేడాది జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. PMGKAY కింద పేదలకు కేంద్రం 5 కిలోల బియ్యం/గోధుమలు ఇస్తోంది.