ఢిల్లీకి పంచాయతీ..మళ్ళీ గీత దాటిన టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ కాంగ్రేస్ లో ఇటీవల లేచిన దుమారం డిల్లీకి చేరింది,ఇటివల 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై ఒక మంత్రిపై అసమ్మతి రాగం వినిపించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని అదిష్టానం సీరియస్ గా తీసుకున్మట్టు తెలుస్తుంది..
ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం చేరింది..సదరు ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ నెల 5న తెలంగాణకు దీపాదాస్ మున్షి వస్తానని తెలిపింది.తాను వచ్చే వరకు ఎక్కడ ఈ అంశంపై మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం..
ఐటీసీ కోహినూర్లో భేటీ తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఫోన్ చేసినట్టు చర్చ జరుగుతుంది.
ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు.పీసీసీ చీఫ్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడటం చర్చానీయాంశమైంది..