రేవంత్ రెడ్డే అఖరి ఓసీ సీఎం..!
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవడం ఖాయం.. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.
హనుమకొండలో జరిగిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని అన్నారు.
తాను అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు.ఓసీ వర్గాల నుంచే 60మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీ ఫారం ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.