చేతులెత్తేసిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఆందోళనలో సీఎం..!
అలవికానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముందు చూస్తే గోయ్యి.. వెనక చూస్తే నొయ్యి అన్నట్లు ఉంది పరిస్థితి. అధికారంలోకి వస్తామో.. రామో అనే సందేహాంతో అన్ని వర్గాలకు దాదాపు నాలుగోందల ఇరవై హామీలిచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా, రైతుబంధు,రైతు భరోసా,కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు లాంటి పథకాలను గాలికోదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాము ఇస్తామన్న నెలకు నాలుగు వేల రూపాయలు.. కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం.. మహిళలకు నెలకు రెండున్నర వేలు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను వేలు.. రైతు కూలీలకు పన్నెండు వేలు లాంటి హామీలను అమలు చేయడానికి నానాతిప్పలు పడుతుంది.
అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు ఏడు నెలల వరకు బడ్జెట్ లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల ప్పులు చేసింది. తాము మిత్తీలు కట్టడానికే సరిపోతుంది. కానీ పథకాల అమలుకు పైసలు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇక మంత్రులు.. ఎమ్మెల్యేలు అయితే ఏకంగా కేసీఆర్ పై మట్టిపోయండి. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల రూపాయలను అవినీతి చేసారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. మేము ఏమి చేయలేము అని బహిరంగంగానే చెబుతున్నారు. అఖరికి ఎంతో హాట్టహాసంగా జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన నాలుగు పథకాలైన రైతు భరోసా.. ఇందిరమ్మ ఇండ్లు.. రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రకటనలకే తప్పా అచరణకు నోచుకోలేదు.
ఒకపక్క క్షేత్రస్థాయిలో ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంది. మరోవైపు ఆఫ్ లైన్ లో చాలనట్లు తాజాగా నిన్న గురువారం అధికార కాంగ్రెస్ పార్టీ తన అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో తెలంగాణ ప్రజలు ఎవరి పాలనను కావాలనుకుంటున్నారు అని ఓ పోల్ పెట్టి మళ్లీ అబాసుపాలయ్యారు. దాదాపు లక్ష ఎనబై రెండు వేల మంది కాంగ్రెస్ ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ లోనే మ్యానేజ్ చేయలేనివాళ్లు. నాలుగున్నర కోట్ల ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా ప్రజల మెప్పును పొందుతారని ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు నెటిజన్లు.. రాజకీయ విశ్లేషకుల నుండి విమర్శలు విన్పిస్తున్నాయి. ఇవి చాలనట్టూ ఏకంగా దీన్ని కవర్ డ్రైవ్ చేయడానికి ఏకంగా అధికార స్పోక్ పర్శన్స్ దగ్గర నుండి పీసీసీ చీఫ్ వరకు అందరూ ప్రెస్ మీట్ లు పెట్టి మళ్లీ ఇజ్జత్ తీసుకునే పనులు చేస్తున్నారు అని ఇటు బయట అటు స్వపక్షం నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.
ఇటు ప్రజాక్షేత్రంలో గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం. అఖరికి తమ అధికార ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా తమ పార్టీ సోషల్ మీడియా ఎంత వీక్ గా ఉందో బయటపడటం.. ఇదే అంశం సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ ఒప్పుకోవడం లాంటి విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది అని సమాచారం. నిన్న జరిగిన పోల్ వివాదంలో ఏకంగా ముఖ్యమంత్రి స్వయంగా క్లాస్ తీసుకున్నట్లు టాక్. సోషల్ మీడియాతో ఆగకుండా కొన్ని మీడియా ఛానెళ్లు నిర్వహించిన పోల్ సర్వేలో కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు నెటిజన్లు జైకొట్టడంతో రానున్న రెండు మూడు రోజుల్లో జరగనున్న క్యాబినెట్ మీటింగ్ లో నేతలకు గట్టి క్లాసులు తప్పవని గాంధీభవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.