బీఆర్ఎస్ లోకి చేరికలు..!
వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఏనుమాముల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీలో గురువారం చేరారు. వారికి మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిగారు, నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా బీజేపీ నుంచి పత్రి సుభాష్, రాపర్తి శ్రీనివాస్, కోరుట్ల శ్రీనివాస్, పస్త కుమార్, తోట శ్రీధర్, రమేష్, రంజిత్, వీరన్న బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లావుల కుమార్ యాదవ్, స్థానిక నాయకులు కేతిరి రాజశేఖర్, పత్రి రాజశేఖర్, పస్తం యాదగిరి, జోరిక రమేష్, నేరెళ్ల రాజు, వీర భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.