కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం..!

 కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం..!

Congress MLA showered compliments on KCR..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గోండ జిల్లా సీనియర్ నాయకులైన కొమటిరెడ్డి బ్రదర్స్.నల్గొండ రాజకీయాల్లో వీళ్ళు ఒక సంచలనం..మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు చెబితే చిర్రుబుర్రులాడే కొమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా రూటు మార్చారు..

తాజాగా మునుగోడు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై,కాంగ్రేస్ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినమంటూ బాంబ్‌ పేల్చారు..

ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత డబ్బును రైతుభరోసాలో తగ్గించామంటూ తప్పు ఒప్పుకున్నారు.. అందుకే గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు..ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..స్వయానా కాంగ్రేస్ ఎమ్మెల్యే ఇలాంటి వాఖ్యలు చేయడం సంచలనంగా మారింది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *