“రైతు భరోసా” అందరికీ కాదా..?
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు రైతు భరోసా.. ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.రేషన్ కార్డుల పంపిణీ.. వీటిలో రైతు భరోసా నిధుల విడుదల గురించి జనవరి ఇరవై ఆరో తారీఖున ఉదయం మాట్లాడుతూ ” ఈరోజు ఆదివారం అందులో గణతంత్ర దినోత్సవం కాబట్టి సెలవు రోజు..
ఈ రోజు ఆర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి రైతులందరీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. ఆ తర్వాత కొడంగల్ లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నాం జరిగిన సభలో మాట్లాడుతూ తూచ్ ఇవాళ కాదు మార్చి ముప్పై ఒకటో తారీఖున అందరికి పడతయాని సెలవిచ్చారు.
కానీ తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా అందరికీ కాదు కేవలం ఆ గ్రామాలకు మాత్రమే అని బదులిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 12,774 గ్రామాలకి గాను మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 577 గ్రామాలకు రూ.560 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు తెలిపినట్లు ఆ వార్తల సారాంశం.