గౌతం గంభీర్ ఓ శాడిస్ట్..!
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే. తర్వాతి సీజన్లో కారణం లేకుండా గౌతం గంభీర్, నన్ను తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్‌లోకి వచ్చాను. నాకు, గంభీర్‌కి మంచి స్నేహం ఉండేది. అయితే నేను, టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతనికి నేనంటే పడేది కాదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అరచేవాడు.
మీడియా కూడా నా గురించి అటెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది.దాంతో గంభీర్ సహించలేకపోయాడు. నా కాన్పిడెన్స్ దెబ్బతీయాలని అనేక రకాలుగా ప్రయత్నించాడు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో మా మధ్య గొడవ పెరిగింది. అతను, నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అప్పటికే కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో మా మధ్య వాగ్వాదం జరిగింది. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను కావాలని కిందకి పంపడం మొదలెట్టాడు. ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో నేను 129 పరుగులు చేశా, ఆ మ్యాచ్‌లో గంభీర్ 110 కొట్టాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో కిందకి పంపారు. నేను బాధపడుతూ వాష్‌రూమ్‌కి వెళ్లాను. అతను అక్కడికి కూడా వచ్చాడు. ఈ యాటిట్యూడ్ అస్సలు పనికి రాదు, నిన్ను మళ్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వనంటూ అరిచాడు.
అసలు నేనేం తప్పు చేశానో అర్థం కాలేదు. నిన్ను ఇకపై ఎప్పుడూ ఆడనివ్వనని నా మీద అరుస్తుంటే అక్కడికి వసీం అక్రమ్ వచ్చాడు. అప్పుడు ఆయన మాకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. గౌతీ, నువ్వు టీమ్ కెప్టెన్‌వి, ఇలా మాట్లాడకూడదని చెప్పాడు… రంజీ మ్యాచుల్లోనూ నేను బ్యాటింగ్‌కి వస్తే టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. నన్ను, మా అమ్మను కూడా తిట్టేవాడు.. నేను ఊరుకునేవాడిని కాదు.నీ తాట తీస్తానని బెదిరించాడు చూసుకుందాం పదా అన్నాను అలా గౌతం గంభీర్, ఎప్పుడూ నన్ను ప్రొత్సహించలేదు సరి కదా, నా కెరీర్ నాశనం చేశాడు అని మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు..