లోకేష్ కు ప్రమోషన్..తేల్చేసిన చంద్రబాబు..
ఏపీలో గత కొన్ని రోజులుగా కూటమి లో మంత్రి నారా లోకేష్ సీఎం,డిప్యూటీ సీఎం చేయాలంటూ జరిగిన చర్చ అంతా ఇంత కాదు..కూటమిలో ఈ అంశం రగడకు దారితీసింది..అయితే దానిపై తాజాగా క్లారిటి వచ్చింది..టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే అంశం పైన కీలక వాఖ్యలు చేసారు.
వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.ఏ రంగమైనా వారసత్వం అనేది మిధ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న పరిస్థితి ల కారణంగా అవకాశాలు వస్తాయని.. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చంద్రబాబు అన్నారు..
తమ కుటుంబం ఎన్నో ఏండ్లుగా వ్యాపారం ప్రారంభించామని,లోకేష్ కు వ్యాపారం అయితే తేలిక అని చెప్పుకొచ్చారు. కానీ, లోకేష్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో రాజకీయాల్లోకి వచ్చారన్నారు.చంద్రబాబు క్లారిటీతో ఇన్నాళ్ళుగా జరిగిన వివాదానికి తెరదించినట్టైంది..